నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివం నిత్య అన్నదాన వాహనం ద్వారా ఒంగోలు నగరంలో పేదలు 300 మందికి పౌష్టిక ఆహారంతో కూడిన భోజనం అందజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లి తన నిరాడంబరతను చాటిన నిజాయతీపరుడు సుందరయ్య నేటి యువతకు ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి టి భక్తసింగ్‌రాజు, డాక్టర్‌ మొగిలిదేవా పాల్గొన్నారు.

➡️