ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు

Apr 7,2024 15:18 #East Godavari, #Health Mission

ప్రజాశక్తి-గోకవరం (తూర్పు-గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు ఘనంగానిర్వహించారు.దినోత్సవం పురస్కరించుకుని ప్రజలందరూ ఆరోగ్యము పట్ల మంచి అవగాహన కల్గి యుండాలని పి.హెచ్.సి వైద్యాధికారి డాక్టర్ సునీల్ అన్నారు.ఈ సందర్భంగా డా.సునీల్, డి.ఏన్.మూర్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ నా ఆరోగ్యం-నా హక్కుఅని ప్రతీ ఒక్కరూ ఈ నినాదంతో అందరికీ అవసరమైన ఆరోగ్య సేవలు, విద్య , సమాచారం, అలాగే సురక్షితమయిన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం , మంచి పర్యావరణ పరిస్థితులు, వివక్షత నుండి స్వేచ్ఛ ను పొందడం కోసం ప్రతీ ఒక్కరికీ ప్రాధమిక హక్కు వాటి కొరకై ఈ నినాదం నొక్కి చెపుతుందన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని ఆయుస్మాన్ క్లినిక్ లలో సచివాలయ కేంద్రాలలో ఓ.ఆర్.యెస్.జింక్ కేoద్రాలు ఏర్పాటు చేయడమైనదని వాటిని ప్రజలు ఉపయోగించు కోవచ్చునని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోకవరం, కొత్త పల్లి వైద్య సిబ్బంది ఎమ్.ఎల్.హెచ్.పిలు,హెల్త్ అసిస్టెంట్లు, ఏ.ఎన్. ఎమ్ లు ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.

➡️