Congress : కాంగ్రెస్‌ నాలుగో జాబితా విడుదల ..

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 45 మంది అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్‌ ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్‌ అభ్యర్థుల పేర్లను పేర్కొంది.  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజక వర్గం నుండి ప్రధాని మోడీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజరు రారు పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.

అజయ్  రాయ్  బిజెపి విద్యార్థి విభాగం  ఎబివిపిలో  తన రాజకీయ జీవితం మొదలు పెట్టారు.  1996-2007 మధ్య 3 సార్లు బిజెపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆపై జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. మరోసారి 2012లో ఎమ్మెల్యేగా గెలిచారు.

మొత్తంగా  అజయ్  రాయ్  5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సమాజ్‌వాది పార్టీ నుండి, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున వారణాసి లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు.

రాజ్‌గఢ్‌ నుండి మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్‌ బరిలోకి దిగారు. తాజాగా విడుదలైన జాబితాలో మధ్యప్రదేశ్‌ నుండి 12, ఉత్తరప్రదేశ్‌ నుండి 9 స్థానాలు, తమిళనాడు నుండి 7, రాజస్థాన్‌ 3, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, జమ్ముకాశ్మీర్‌లో రెండేసి స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. అసోం, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులలో ఒక్కోస్థానంలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు.

➡️