పోరాటాలపై వక్రీకరణలను తిప్పికొట్టాలి

చిలకలూరిపేట: నైజం నవాబులు పాలనలో ఉన్నది ఒక్క ముస్లింలే కాదని, అనేక రకాల వాళ్ళు ఉన్నారని, భూమి కోసం, భుక్తి కోసం నైజాం నిరంకుశ పాలనపై పెద్ద ఎత్తున దేశ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన పోరాటాలకు కులం, మతం లేదని, అలాంటి ఉద్యమ పార్టీలకు కులాలను ఆపాదించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అన్నారు. యడ్ల పాడు మండలం తుమ్మల పాలెంలోని అమర్‌నగర్‌లో శనివారం తుమ్మల పాలెం అమరవీరుల స్మారక సభ జరిగింది. ముఖ్య అతి థిగా పాల్గొన్న విజయకుమార్‌ మాట్లాడుతూ నైజాం నవాబులకు వ్యతి రేకంగా తెలంగాణ సాయుధ పోరాటాలు పెద్ద ఎత్తున అనేక గ్రామాల్లో జరిగాయని, ఆ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పో యారని చెప్పారు. అటువంటి అమ రులను ప్రతి సంవత్సరం గుర్తుచేసుకోవ డం శుభపరిణామం ఉన్నారు. కమ్యూనిస్టు పోరాడి నేలకొరిగిన ఈ 27 మంది వీరుల బలిదానం ఎందుకు అనే విషయాన్ని కనీసం ఈ ప్రాంత ప్రజలకు, యు వతకు గుర్తుచేసేందుకే ప్రతి సంవత్సరం ఈ స్మారక సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

నాడు నవాబులను, పెత్తందార్లను వ్యతి రేకించే క్రమంలోనే గెరిల్లా దళాలు ఏర్పడ్డా యని, ఆ ఉద్యమాలలో కులాలు లేవు,మ తాలు లేవని కేవలం కష్టజీవుల భుక్తి కోసం, విముక్తి కోసమే ఆ ఉద్యమాలు జరి గిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి ఉద్యమాలకు నేడు కులాన్ని ఆపాదించే చర్యలు చేస్తున్నారని, వాటిని కలసికట్టుగా తిప్పి కొట్టాలని కోరారు. కమ్యూనిస్టులను అగ్రవర్ణాల పార్టీ గా చిత్రీకరించి జనంలోకి తీసుకెళ్లే ప్రయ త్నాలు నేడు అనేక పార్టీల వాళ్లు చేస్తు న్నారని, వీటిని తిప్పికొట్టాలని అన్నారు. గత రాజకీయాలకు నేటి రాజ కీయాలు చాలా వ్యత్యాసం ఉందని, కేవ లం డబ్బు ఉంటేనే వారిని నాయకులుగా ఎన్నుకునే పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్పారు. రాజకీయం కేవలం డబ్బు మీద నడవదన్న విషయాన్ని తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రస్తుత కమ్యూనిస్టులు ఉద్యమాలు నీరసించి పోతున్నాయని, ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నా య కులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు మాట్లా డుతూ ఉద్యమాల్లోనే కాకుండా ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు అందరూ కలసి కట్టుగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిం దన్నారు. పార్లమెంటులోనూ అసెంబ్లీ లోనూ కమ్యూనిస్టుల గొంతుకలను విని పిం చాల్సిన సమయం ఆసన్నమైందన్నా రు. కలిసికట్టుగా ఉద్యమాల్లో పాల్గొన్నట్లే ఈ ఎన్నికల్లో పాల్గొని ఎక్కువ మందిని అసెంబ్లీకి పార్లమెంటుకు పంపించాల న్నారు. సిపిఎంఎల్‌ రాష్ట్ర నాయకులు మన్నవ హరి ప్రసాద్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టులు నిస్వా ర్థంగా ప్రజల కోసమే అనేక త్యాగాలు చేశారని అందుకు ఉదాహ రణ ఈ తుమ్మలపాలెం స్మారక సభ అని అన్నారు. కలసికట్టుగా మన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్ర మానికి నరసింహారావు అధ్యక్షులుగా వ్యవహరించారు. మొదట ఆయా పార్టీల జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పిం చారు.

➡️