ప్రజా సంక్షేమ కోసం పనిచేద్దాం : ‘నల్లారి’

ప్రజాశక్తి-పీలేరు మండల అభివద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికా రులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చద్దామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో పనిచే శారని, అలాంటి పరిస్థితులు రాకుండా, లేకుండా చూద్దామని అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నాయకులు తమ కుటుంబ సభ్యులను ఉద్యోగస్తులుగా పేర్ల చేర్చి, వారు పనిచేయకనే నెలనెలా వేతనాలు చెల్లించిన విషయం తమ దష్టికి వచ్చిందన్నారు. కొత్తగా వచ్చిన ఇఒ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి తనకు నివేదిక ఇవ్వాలని చెప్పారు. పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ భూముల అన్క్రాంతంపై ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా తాను చేసిన ఫిర్యాదుపై స్పందించిన అప్పటి మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టి, ప్రభుత్వ భూముల కబ్జాపై నివేదిక సమర్పించారని, నిజాయితీగా నివేదిక అందించిన ఆ అధికారిణిని బదిలీ చేయించారని గుర్తు చేశారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది వాటిని పట్టించుకోకుండా ఆ భూములను కబ్జా చేసిన వైసిపి నాయకులకు అడ్డదారిలో పంచిపెట్టారన్నారు. పట్టణానికి 12 వేల ఇంటి స్థలాలు కేటాయించారని, వాటిలో ఆ పార్టీ అధికార పార్టీ నాయకులు తమ ఇష్టానుసారంగా అమ్ముకున్నట్లు చెప్పారు. స్థానికంగా సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలోనూ దండిగా అవకతవకలు జరిగాయని, తమ ఇష్టానుసారంగా వేర్వేరు సర్వే నెంబర్లపై ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపించారు. మండలంలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమా వేశంలో మండల స్థాయి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.అధికారం ఉందని అహం చూపొద్దు అధికారం ఉందని అహం చూపి ప్రజల పట్ల దురుసుగా ప్రవరించడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల సంస్కతి, సాంప్రదాయాలు కాదని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివద్ధికి ప్రాధాన్యత నివ్వడం టిడిపి లక్ష్యమన్నారు. దౌర్జన్యాలు, కక్ష సాధింపులు, కబ్జాలు, తప్పుడు కేసుల బనాయింపులు, వేధింపులు వాటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, ప్రజాహితం మనకు ముఖ్యమని చెప్పారు. తన విజయం కోసం కషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రజా ప్రతినిధులు ప్రజాగ్రహానికి గురై ప్రస్తుతం భద్రత కోరుతూ కోర్టులు ఆశ్రయించే పరిస్థితికి వచ్చారని, అలాంటి పరిస్థితి భవిష్యత్తులో మనకు రాకుండా ప్రజలతో మమేకమై వారి సంక్షేమం, అభివద్ధి కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి శ్రేణులు కోటపల్లి బాబురెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అమర్నాథరెడ్డి, శివారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, పురం రామ్మూర్తి, పోలిశెట్టి సురేంద్ర, వసంతాల రాజ, నారే సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️