సమగ్ర శిక్ష ఉద్యోగులకు వ్య.కా.సం మద్దతు

Dec 18,2023 16:36 #anakapalle district
support-to-samagra-employees

 

ప్రజాశక్తి-దేవరపల్లి : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉద్యోగుల అందోళనకు ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న మద్దతు తెలిపారు సోమవారం జేఏసీ పిలుపుమేరకు దేవరాపల్లి మండలం సమగ్ర శిక్ష ఉద్యోగుల అందోళనలో పల్గోని మద్దతు తెలిపిన అనంతరం అయిన మాట్లాడారు. డిసెంబర్ 16 నుంచి 19 వరకు పెన్డౌన్, మౌస్ డౌన్,కార్యక్రమాన్ని చేపాట్టరాని విరి న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేసారు. ప్రతి మండల ఎం ఆర్సి వద్ద నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల (MIS, DTEO, ACCOUNTANT, MESSENGER,CRMTS,PTIs, IERPS,) అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. గత నాలుగు నెలలగా జీతాలు లేక కుటుంబ పోషణ ఇబ్బంది కరంగా మారిందని తెలిపారు. అందువలన ఈనెల 4వ తారీఖున ఆవేదన దీక్ష అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తారని అతర్వాత 11 వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఈకార్యక్రమానికి ముఖ్య యూనియన్ నాయకులు పాల్గొన్నారని తెలిపారు యూనియన్ నాయకుల అందరి కలిపి సమగ్ర శిక్ష (SPD)ని కలవడం జరిగిందని అయినను సానుకూలంగా, స్పందించలేదన్నారు. ఆ తర్వాత తీసుకునె నిర్ణయమే 16 నుంచి 19 వరకు పేన్ డౌన్ అనే కార్యక్రమం మొదలు పెట్టారని తెలిపారు. 19వ తేదీ వరకు ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబరు 20 నిరవధిక సమ్మెకు దిగుతారని అంతవరకు తెచ్చుకోకుండా వారి న్యామైన డిమాండ్లు పరిష్కరించాలని వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు ఈకార్యక్రమంలో పిపార్వతి, సిహెచ్ రమేష్ యం శ్రీను పి గంగాధర్ వివి, రమణ కె మాధవి పిబియస్ ఉపేంద్ర వైసాగర్ టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️