నూతన రిజిస్ట్రేషన్‌ చట్టం రద్దు చేయాలి

Dec 7,2023 23:37

ప్రజాశక్తి – చీరాల
రాష్ట్ర ప్రభుత్వం 2023లో యాక్ట్ 27 ఆఫ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనే నూతన చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టంలో ఉన్న అనేక అంశాలు న్యాయ నిపుణులతో చర్చించకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా రహస్యంగా ఉంచి ప్రస్తుతం బిల్లు రూపంలో ఆమోదించారని, వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు గురువారం కోర్టు వద్ద నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ చట్టం ఉద్దేశ్యం ప్రజల స్థిరాస్తుల విషయంలో తగాదాలు ఏర్పడితే ఆ తగాదాలు పరిష్కరించే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుండి ప్రభుత్వంచే ఏర్పాటు కానున్న జిల్లా స్థాయి ట్రిబ్యునల్ కు అధికారాలు బదిలీ చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి రమేష్ బాబు, కె చంద్రశేఖరరావు అన్నారు. ఈ చట్టం వలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సిపిఎం నాయకులు ఎల్ జయరాజు, డి నారపరెడ్డి సంఘీభావం తెలిపారు.

➡️