అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కౌంటీలోని ఒక ఇంటిలో ఉంటున్న నలుగురు భారతీయులు విగతజీవులుగా కనిపించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు భారతదేశంలోని కేరళ కొల్లాంకు చెందిన ఆనంద్‌ సుజిత్‌ హెన్రీ (42), అతని భార్య అలిస్‌ ప్రియాంక (40), కవలలు నోహ్, నాథన్‌ (4)లుగా గుర్తించారు. వీరంతా హీటర్‌ నుంచి వచ్చిన విషవాయువులు పీల్చిన కారణంగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. మఅతుడు ఆనంద్‌ కోల్లాంలోని ఫాతిమా మాత నేషనల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జీ హెన్రీ కుమారుడు. ఆనంద్‌ ఇటీవలే గూగుల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, తన కొత్త కంపెనీని ప్రారంభించారు. కాగా వీరి మృతికి గల కారణాలను శాన్‌ మాటియో పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 12న ఉదయం 9.15 గంటలకు వీరి మఅతదేహాలను పోలీసులు గుర్తించారు.

➡️