సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్

imran-khan-moves-pakistan-supreme-court-for-bail-in-al-qadir-trust-corruption-case

పాకిస్తాన్ : అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు అతని భార్య బెయిల్ కోసం పాకిస్తాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఒక మీడియా తెలిపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి బిలియన్ల రూపాయల విలువైన భూమిని లంచంగా అందుకున్నారని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి కేసు నమోదు చేసిన సంగతి విదితమే. వివిధ కేసుల్లో సెప్టెంబర్ 26 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదీగా ఉన్న ఖాన్ నవంబర్ 14న ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) తన పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక ప్రకారం, ఖాన్ బెయిల్ దరఖాస్తులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB), మాజీ పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM) ప్రభుత్వానికి ఒక సాధనంగా వ్యవహరిస్తూ, రాజకీయ కారణాలతో తనను వేధించడానికి ఈ కేసును ఉపయోగించిందని ఆరోపించారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అతని అరెస్టుపై నవంబర్ 14 నాటి ఐహెచ్ నిర్ణయాన్ని మరియు ఆగస్టు 10న అకౌంటబిలిటీ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించినట్లు అప్పీల్లో పేర్కొన్నారు.

➡️