Indonesia : సైబర్ మోసం కేసులో 103 మంది తైవానీయులను అరెస్ట్‌

జకార్తా :   సైబర్‌ మోసం కేసులో 100మందికి పైగా తైవాన్‌ దేశస్థులను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాలిలోని ఓ విల్లా నుండి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఇండోనేషియా పోలీసులు అందించిన సమాచారంతో ఈ నెల 26న తబనన్‌ రెసిడెన్సీలోని విల్లాపై దాడి చేశామని అన్నారు. 12 మంది మహిళలు సహా మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నామని, వందలాది ఫోన్‌లు, పలు ఎలక్ట్రానిక్‌ డివైస్‌లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారు వలస చట్టాలను ఉల్లంఘించారని, మలేషియన్లు లక్ష్యంగా ఆన్‌లైన్‌ స్కామ్‌లు చేపడుతున్నారని ఇండోనేషియన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారి సఫర్‌ మొహమ్మద్‌ తెలిపారు. అయితే అధికార పరిధికి వెలుపల ఉండటంతో వారిపై నేరాలు మోపలేదని, మలేషియా అధికారులకు సహకరిస్తున్నారని అన్నారు. విచారణ కోసం బాలిలోని ఇమ్మిగ్రేషన్‌ నిర్బంధ శిబిరానికి తరలించామని ఆయన ఓ ప్ర కటనలో తెలిపారు.

➡️