అంతర్జాతీయ కోర్టులో నేడు వాదనలు వినిపించనున్న ఇజ్రాయిల్‌

Jan 12,2024 12:44 #israel hamas war, #World Court

జెనీవా :    పాలస్తీనియులపై చేపడుతున్న నరమేథంపై ఐరాస అత్యున్నత న్యాయస్థానం (ఐసిజె)లో ఇజ్రాయిల్‌ శుక్రవారం వాదనలు వినిపించనుంది. పాలస్తీనీయులను తుడిచిపెట్టే లక్ష్యంతోనే ఇజ్రాయిల్‌ మారణకాండ చేపట్టిందని దక్షిణాఫ్రికా డిసెంబర్‌లో ఐసిజెలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ను తక్షణమే దాడిని నిలిపివేయాలని ఆదేశించే అత్యవసర చర్యలను చేపట్టాలని గురువారం న్యాయమూర్తులను కోరింది.

ఇజ్రాయిల్‌ వైమానిక, భూతల దాడులతో గాజాను శిథిలం చేసింది. పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం.. 23,000 మందికి పైగా మరణించారు. గాజా ప్రజలను ఊచకోత కోయాలనే లక్ష్యంతోనే దాడులు చేపట్టిందని వాదించింది. మారణహోమం వాదనలను ఇజ్రాయిల్‌ తిరస్కరించింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. దక్షిణా ఫ్రికా హమాస్‌ ప్రతినిధిగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఐసిజె నిర్ణయం అంతిమంగా ఉంటుంది. అప్పీలు చేసేందుకు అవకాశం ఉండదు.

➡️