మావో ఆలోచనలే నేటికీ చైనాకు మార్గదర్శకాలు

Dec 29,2023 08:30 #China
mao 139 jayanti in china

 

139 జయంతి వేడుకలో జిన్‌పింగ్‌

బీజింగ్‌ : విప్లవనాయకులు మావో జెడాంగ్‌ ఆలోచనలే నేటికీ చైనాకు మార్గదర్శకాలు అని ఆ దేశ అధ్యక్షులు జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. మావో జెడాంగ్‌ 130వ జయంతి సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) సెంట్రల్‌ కమిటీ గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌లో సింపోజియ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ మావో జెడాంగ్‌ ఆలోచనలు పార్టీకి, దేశానికి అమూల్యమైన సంపదని అన్నారు. మావో జీవితమంతా దేశశ్రేయస్సు, పునరుజ్జీవనం, ప్రజాల ఆనందానికి అంకితం అయిందని తెలిపారు. మావో స్ఫూర్తి భావితరాలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మన నూతన ప్రయాణంలో మావో లక్ష్యాలను ఎప్పటికీ మరిచిపోకూడదని అన్నారు. మార్స్సిజాన్ని చైనాకు అనుకూలంగా మార్చడంలో మావో ప్రాధాన్యతను గుర్తు చేశారు. అధునాతన సోషలిస్ట్‌ వ్యవస్థను స్థాపించడంలోనూ, అజేయమైన చైనా ప్రజల సైన్యం యొక్క కొత్త నమూనాను స్థాపించడంలో మావో కీలకపాత్ర పోషించారని అన్నారు. చైనా దేశానికి, చైనా ప్రజలకు మావో చెరగని చారిత్రాత్మక సేవలను అందించారని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రయంలో సిపిసి సెంట్రల్‌ కమిటీ పొలిటికల్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు లి కియాంగ్‌, జావో లెజి, వాంగ్‌ హునింగ్‌, డింగ్‌ జుక్సియాంగ్‌, లి జి, వైస్‌ ప్రెసిడెంట్‌ హాన్‌ జెంగ్‌ సింపోజియమ్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సిపిసి సెంట్రల్‌ కమిటీ పొలిటికల్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సభ్యులు కై క్వి అధ్యక్షత వహించారు.

➡️