తెల్ల జెండా చూపినా ముగ్గురు బందీలను కాల్చి చంపేశారు

Dec 18,2023 08:13 #Israel, #israel hamas war
More death and destruction in Gaza as Israeli attacks continue

తరువాత పొరపాటు అంటూ వివరణ
ఇజ్రాయిల్‌ సైన్యం దాష్టీకంపై సర్వత్రా ఆగ్రహం
హమాస్‌తో నార్వేలో కొనసాగుతున్న చర్చలు

టెల్‌ అవీవ్‌/గాజా సిటీ: హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీయులను కాల్చి చంపడం ఇజ్రాయెల్‌ సైన్యానికి పెద్ద ఎదురుదెబ్బ. తెల్ల జెండా ఊపుతూ వెళ్తున్న వారిని కాల్చి చంపినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం అంగీకరించింది. గాజా నగరంలో చొక్కా వేసుకోకుండా తెల్లజెండా పట్టుకున్న యోతమ్‌ హైమ్‌ (28), సమర్‌ తలాల్కా (25), అలోన్‌ షమ్రిస్‌ (26) అనే ముగ్గురు బందీలను ఇజ్రాయిల్‌ సైన్యం కాల్చిపారేసింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో సైన్యం వివరణ ఇచ్చింది. వారు దాడి చేసేందుకు వచ్చారను అనుమానంతోనే కాల్పులు జరిపామని, వారు బందీలు అనిఆ తరువాత తేలిందని తెలిపింది. వారు తప్పించుకున్నారా లేదా హమాస్‌ వదిలిపెట్టిందా అన్నది స్పష్టం కాలేదు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దీనిపై స్పందిస్తూ ఇది ”భరించలేని విషాదం” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి సీనియర్‌ సలహాదారు మార్క్‌ రెగెవ్‌ తెలిపారు. పారిపోవడానికి ప్రయతిుంచిన పౌరులను ఇజ్రాయెల్‌ దళాలు కాల్చిచంపినట్లు అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. బందీలను చంపిన తర్వాత ఇజ్రాయెల్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. బందీలను విడిపించేందుకుఒప్పందానిు కోరుతూ వేలాది మంది టెల్‌ అవీవ్‌లో కవాతు నిర్వహించారు. దీంతో హమాస్‌తో శాంతి చర్చలకుఇజ్రాయెల్‌ సిద్ధమైంది. ఖతార్‌ మధ్యవర్తిత్వంలో నార్వేలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 100 మంది ఇజ్రాయిలీయులు హమాస్‌ చేతిలో బందీలుగా ఉనాురు.ఇదిలా ఉండగా గాజా సిటీలో ఇజ్రాయెల్‌ తన దురాక్రమణను కొనసాగిస్తూనే ఉంది. ఉత్తర గాజాలో ఇళ్లపై జరిగిన దాడిలో 14 మంది చనిపోయారు. దీంతో గాజాలో మరణించిన వారి సంఖ్య 18,787కి చేరింది. దక్షిణ గాజాలోనిఖాన్‌ యూనిస్‌లో జరిగిన దాడిలో అల్‌ జజీరా కెమెరామెన్‌ సమీర్‌ అబు దక్కా మరణించాడు. కమల్‌ అద్వాన్‌, అల్‌-అవుదా ఆసుపత్రుల్లో చిక్కుకున్న వారు బయటకు రాలేకపోతునాురు. గాయపడిన వ్యక్తులతో కమల్‌ అద్వాన్‌ వెళ్తును అంబులెన్స్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసింది.

➡️