Ramzan: ‘పండుగల గురించి ఇప్పుడు ఆలోచించలేము’

  • గాజాకు చెందిన జబీర్ హసన్

గాజా : ప్రపంచ వ్యాప్తంగా నేడు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే పాలస్తీనాలో పరిస్థితి వేరు. కనీసం తినడానికి తిండి కూడా లేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు. ”పాలస్తీనా ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్నారు. కుటుంబ సభ్యులు ఆహారం కూడా తీసుకురాలేకపోతున్నారు. చిన్న పండగ, ఇతర వేడుకల గురించి ఇప్పుడు ఆలోచించలేను. అయితే ఈ సంక్షోభం మొత్తాన్ని అధిగమిస్తాం’’ అంటూ గాజాకు చెందిన జబీర్ హసన్ చెప్పిన మాటలు పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను, ఆశలను ప్రతిబింబిస్తాయి.

గాజాలోని అల్ అక్సా మసీదులో ఈద్ గాహ్‌పై ఇజ్రాయెల్ సైన్యం కఠినమైన ఆంక్షలు విధించింది. 60 ఏళ్లు పైబడిన పురుషులు మరియు 50 ఏళ్లు పైబడిన మహిళలు మాత్రమే అనుమతించారు. వెస్ట్ బ్యాంక్ నుండి కొంతమంది మాత్రమే మసీదులోకి ప్రవేశించడానికి అనుమతించారు. కాగా, గాజాలో గత 24 గంటల్లో మరో 122 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 33,482కి చేరింది. 76,049 మంది చికిత్స పొందుతున్నారు.

➡️