పాక్‌ ప్రధానిగా మళ్లీ షెబాజ్‌ 

Feb 21,2024 10:21 #Pakistan, #prime minister
Shehbaz as Prime Minister again
  • పాక్‌లో తొలగిన ప్రతిష్టంభన 
  • అధ్యక్షుడిగా అసిఫ్‌ జర్దారి 
  • కుదిరిన ఒప్పందం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గత కొన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ(పిపిపి) మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెబాజ్‌ షరీఫ్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ నాయకుడు అసిఫ్‌ జర్దారిని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన పాక్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమయ్యింది. పిఎంఎల్‌-ఎన్‌ సీనియర్‌ నేత, సెనెటర్‌ ఇషాక్‌ డర్‌ నివాసంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎన్నికల అనంతరం ఏర్ప డిన ప్రతిష్టంభనను పరిష్కరించేం దుకు ఇప్పటికి ఇరు పార్టీల సమన్వ య కమిటీల మధ్య ఐదుసార్లు చర్చలు జరిగాయి. సోమవారం మూడు గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత మంగళవారం జరిగిన తుదివిడత చర్చలు ఫలించాయి. పిపిపిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సంబంధించిన అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పిఎంఎల్‌-ఎన్‌ నేత ఆజం నజీర్‌ విలేకర్లకు తెలిపారు. ఇదిలావుండగా, ముత్తెహిదా క్వామి మూవ్‌మెంట్‌ (పాకిస్తాన్‌) పిఎంఎల్‌-ఎన్‌కు మద్దతునిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ పార్టీకి 17సీట్లు వున్నాయి.

➡️