అమెరికా వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ..

వాషింగ్టన్‌ : గత కొన్ని వారాలుగా గాజాకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. కొలంబియా, యేల్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీలతో పాటు పలు కళాశాలల్లో శిబిరాలు ఏర్పడ్డాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా దళాలను మోహరించాయి.
గాజాలో శాశ్వత కాల్పుల విరమణ చేపట్టాలని, ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేయాలని, నిరసనల్లో పాల్గన్న విద్యార్థులు, అధ్యాపకులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. యూదు, ముస్లింలకు చెందిన వ్యక్తులతో పాటు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు పాలస్తీనాకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనల్లో పాల్గంటున్నారు. ‘స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా’, ‘జెవిష్‌ వాయిస్‌ ఫర్‌ పీస్‌’ వంటి సంస్థలు ఈ నిరసనలకు అధ్యక్షత వహిస్తున్నాయి. క్యాంపస్‌లలో ఏర్పాటు చేసిన శిబిరాలలో సర్వమత ప్రార్థనలు, సంగీత కార్యక్రమాలు, డ్రాయింగ్స్‌ వంటివి చేపడుతున్నారు. శాంతియుతంగా  నిరసన చేపడుతున్న దాదాపు వందమందికి పైగా విద్యార్థులను, అధ్యాపకులను పోలీసులు గతవారం  అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

➡️