ఆఫ్ఘనిస్తాన్‌లో ఇద్దరికి బహిరంగంగా మరణశిక్ష

Feb 23,2024 11:01 #Afghanistan, #international

ఘజ్ని, ఆఫ్ఘనిస్తాన్‌ : ఇద్దరు హంతకులకు తాలిబన్‌ గురువారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేసింది. ఆగేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక స్టేడియంలో వేలాదిమంది చూస్తుండగా, బాధితుల బంధువులు వారిద్దరు చనిపోయేవరకు కాల్పులు జరిపారు. వేర్వేరు దాడుల్లో ఇద్దరు బాధితులను పొడిచి చంపేయడానికి వీరిద్దరు బాధ్యులంటూ తాలిబన్‌ సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా చేసే నేరాలకు ప్రతీకారంగా మరణ శిక్ష అమలు చేయాలని తాలిబన్‌ సుప్రీం నేత హిబతుల్లా అఖుండ్జా ఆదేశించారు.2021లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన మరణశిక్షల్లో ఇది మూడవది, నాలుగవది.

➡️