సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం : రూ.100 కోట్ల ఆస్తి నష్టం

చెన్నై : సబ్బుపొడి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి దాదాపు రూ.100 కోట్ల ఆస్తి నష్టం కలిగిన ఘటన శనివారం ఉదయం తమిళనాడులోని ఉత్తర చెన్నైలో జరిగింది. ఉత్తర చెన్నైలోని మనాలి సమీపంలోని వైకాడు ప్రాంతంలోని సబ్బు పొడి గోదాంలో ఈరోజు ఉదయం భారీ ఎత్తున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. వెంటనే ఆరు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. గత ఐదు గంటలుగా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మనాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తమిళనాడు అగ్నిమాపక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రియా రవిచంద్రన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలిపారు.

➡️