70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు : ప్రియాంక

దిస్పూర్‌ : మోడీ సర్కార్‌ ప్రజా సమస్యల్ని విస్మరించి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. అసోంలోని దుబ్రిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘కాషాయ పాలకులు ప్రజల ఇబ్బందులు పట్టించుకోరు. ఈరోజు దేశంలో నిరుద్యోగం అత్యధికంగా ఉంది. యువత ఉద్యోగాలు లేక తీవ్రంగా సతమతమవుతోంది’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని మోడీ సర్కార్‌ సమాజంలో విభజన చిచ్చు రేపుతోంది. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

➡️