Supreme Court : ఆప్‌ నేత సంజయ్ సింగ్‌కు ఊరట

న్యూఢిల్లీ :    ఆప్‌ ఎంపి సంజయ్  సింగ్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.  ట్రయల్‌ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఉండాలని తెలిపింది.  అయితే సంజయ్  సింగ్‌ను రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు  అనుమతిస్తారా లేదా అనేది తెలియాల్సి వుంది. మరో  మూడు వారాల్లోపు లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.  మనీలాండరింగ్‌ కేసులో తనను ఇడి అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేయడాన్ని సవాలుచేస్తూ సంజయ్  సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో గతేడాది అక్టోబర్‌లో సంజయ్  సింగ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.    ఆరు నెలల పాటు ఆయన జైలులో ఉన్నారు.

సత్యమేవ జయతే : అతిషీ
ఆప్‌ నేత సంజరుసింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత అతిషీ స్వాగతించారు. సత్యమేవ జయతే అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

➡️