CAA : సిఎఎ అమలు ఆమోదయోగ్యం కాదు : విజయ్

Mar 12,2024 12:43 #CAA, #Hero Vijay

చెన్నై : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవడంపై తమిళ స్టార్‌ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు ఆ పార్టీ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో ఉన్నప్పుడు.. భారత పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) 2019 వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు అని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
కాగా, సిఎఎ అమలుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలముందు పొలిటికల్‌ మైలేజ్‌ పెంచుకునేందుకే మోడీ ప్రభుత్వం సిఎఎ అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని స్టాలిన్‌ విమర్శించారు. తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని స్టాలిన్‌ తేల్చి చెప్పారు.

➡️