ఎంపిలు, ఎమ్మెల్యేలపై డిజిటల్‌ మానిటరింగ్‌ సాధ్యం కాదు : సుప్రీంకోర్టు

 న్యూఢిల్లీ   :   ఎంపిలు, ఎమ్మెల్యేలను డిజిటల్‌గా పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారిపై మానిటరింగ్‌ సాధ్యం కాదని పేర్కొంది.  ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. మరోసారి ఇటువంటి పిటిషన్‌తో కోర్టును ఆశ్రయించవద్దని చీఫ్‌ జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి. పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎంపిలు, ఎమ్మెల్యేల భుజాలపై మైక్రోచిప్‌లు అమర్చి మానిటర్‌ చేయలేమని పేర్కొంది. మెరుగైన పాలనను అందించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపిలను డిజిటల్‌ మానిటరింగ్‌ చేయాలని సురిందర్‌ నాథ్‌ కుంద్రా పిటీషన్‌ దాఖలు చేశారు. ఏ ఎంపి, ఎమ్మెల్యేనైనా డిజిటల్‌గా ఎలా పర్యవేక్షించగలమని ప్రశ్నించింది. వారికి గోప్యతా హక్కు ఉందని, అందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

➡️