వరుసగా మూడోసారి ఈడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ :    ఢిల్లీ లిక్కర్‌పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ఈడి దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే సమన్లు చట్టవిరుద్ధమని, ఆయనను అరెస్ట్‌ చేయడమే ఈడి ఏకైక లక్ష్యమని వెల్లడించాయి. కేజ్రీవాల్‌ ఈడి సమన్లను దాటవేయడం వరుసగా ఇది మూడోసారి. వరుసగా నవంబర్‌ 2 మరియు డిసెంబర్‌ 21 సమన్లను దాటవేశారు. ఎన్నికల ముందు ఎందుకు సమన్లు జారీ చేశారని ప్రశ్నించాయి. ఆయనను ఎన్నికల ప్రచారం నుండి అడ్డుకునేందుకే ఈ నోటీసు జారీ చేశారని మండిపడింది.

ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) ఏప్రిల్‌లో విచారించింది. అయితే ఆయనను నిందితుడిగా పేర్కొనలేదు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేయగా, ఆప్‌ రాజ్యసభ ఎంపి సంజరు సింగ్‌ను అక్టోబర్‌లో అదుపులోకి తీసుకుంది.

➡️