పశ్చిమ బెంగాల్‌లో ఆశాల ఆందోళన

కోల్‌కతా : తమ డిమాండ్ల సాధన కోసం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆశా వర్కర్లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, కార్మికులు, ఫెసిలిటేటర్లుకు ప్రభుత్వ ఉద్యోగ హోదా ఇవ్వాలని, పదవీ విరమణ ప్యాకేజీలో భాగంగా పెన్షన్‌, పారదర్శకంగా నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆశాల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి సలీం మద్దతు తెలిపారు. వారినుద్ధేశించి మాట్లాడారు. ఆశాల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం నాయకులు మధుజా సేన్‌రారు, గార్గి ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.

➡️