జూన్‌ 4తో బిజెడి ప్రభుత్వ గడువు ముగుస్తుంది : మోడీ

May 6,2024 20:03 #PM Modi

భువనేశ్వర్‌ : రానున్న జూన్‌ 4తో బిజు జనతాదళ్‌ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాగ్రెస్‌, బిజెడి నేతలు ఒడిశాను దోచుకున్నారని, ధనిక రాష్ట్రం, పేద ప్రజల తరహాగా మార్చారని అన్నారు. నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కారణంగా ఒడిశాలో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం పేదరికంలోనే ఉన్నారని అన్నారు. ఈ పాపాన్ని క్షమించరని, ప్రస్తుత పాలక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

➡️