నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై మహారాష్ట్రలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన ఎన్‌సిపి, శివసేనల పార్టీల మధ్య ఎట్టలకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్‌సిపి నేత అజిత్‌ పవార్‌, శివసేన పార్టీ నేత ఏక్‌నాథ్‌షిండేలు చర్చలు జరిపారు. చివరకు మహారాష్ట్రలోని మహాయత్‌ (బిజెపి, శివసేన, ఎన్‌సిపి) కూటమి మధ్య సీట్ల సర్దుబాటు విషయంపై ఓ కొలిక్కి వచ్చినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అజిత్‌ పవార్‌ (ఎన్‌సిపి) వర్గానికి నాలుగు సీట్లు, ఇక మరో మిత్రపక్షమైన ఏక్‌నాథ్‌షిండే (శివసేన) వర్గానికి పార్టీకి 13 స్థానాలకు, బిజెపి 31 స్థానాల్లో పోటీకి దిగేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ కూటమి పోటీ చేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

➡️