ఎన్నికల బాండ్లు, సందేశ్‌ఖలిపై వామపక్ష అభ్యర్థుల ప్రచారం

కోల్‌కతా :   పశ్చిమ బెంగాల్‌ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్‌ఖలి అంశాలపై ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. సిపిఎం నేత సుజన్‌ చక్రవర్తి డమ్‌డమ్‌ నుండి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంత కార్మికుల దుస్థితి గురించి బాగా అర్ధం చేసుకున్న చక్రవర్తి ఈసారి తన గెలుపునకు అవకాశాలు బాగుంటాయని ఆశిస్తున్నారు.

జాదవ్‌పూర్‌ నుండి వామపక్ష అభ్యర్ధిగా బరిలోకి దిగిన సృజన్‌ భట్టాచార్య, ముర్షిదాబాద్‌ నుండి మహ్మద్‌ సలీంలు కూడా స్థానిక సమస్యలతోపాటూ సందేశ్‌ఖలిపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోనూ సిపిఎం అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

➡️