దీదీ నుదుటిపై 3 కుట్లుపడ్డాయి.. ఆరోగ్యం నిలకడగా ఉంది : అధికారి

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (66) నుదుటిపై మూడు కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర పరిపాలన సీనియర్‌ అధికారి శుక్రవారం తెలిపారు. అధికారి మీడియాతో మాట్లాడుతూ … సిఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సీనియర్‌ వైద్యులు ఆమెను నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. రాత్రి కూడా ఆమె బాగానే నిద్రపోయారు అని వెల్లడించారు. నుదుటిపై మూడు కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. దీదీ గురువారం సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరై తన ఇంటికి వచ్చారు. ఇంట్లో పడిపోవటంతో ఆమె నుదుటిపై పెద్ద గాయం అయ్యిందని, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రక్తం వస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. దీదీ ప్రస్తుతం కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️