సోరెన్‌కు ఒక్కరోజు జ్యుడీషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ :   ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు రాంచీ ప్రత్యేక కోర్టు గురువారం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై బుధవారం అర్థరాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పదిరోజుల పాటు కస్టడీ విధించాల్సిందిగా ఈడి కోరగా.. కేవలం ఒక్కరోజు కస్టడీ విధిస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన అరెస్ట్‌పై హేమంత్‌ సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.

గవర్నర్‌తో సమావేశం కానున్న చంపై సోరెన్‌

హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో గత 18 గంటలుగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఎం అభ్యర్థి చంపై సోరెన్‌ గవర్నర్‌ సిపి. రాధాకృష్ణన్‌ను కోరారు. నేటి సాయంత్రం 5.30గంటలకు గవర్నర్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. హేమంత్‌ సోరెన్‌ రాజీనామాతో బుధవారం రాత్రి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

➡️