3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో

May 11,2024 23:29 #issro

చెన్నై : అంతరిక్ష రంగంలో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటుతున్న ఇస్రో మరో విజయం అందుకుంది. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో రూపొందించిన పీఎస్‌4 రాకెట్‌ ఇంజెన్‌ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. హాట్‌ టెస్టింగ్‌ పేరిట జరిగిన ఈ పరీక్షలో ఇస్రో పీఎస్‌4 ఇంజెన్‌ను 664 సెకెన్ల పాటు మండించింది. ఏఎమ్‌ టెక్నాలజీతో (3డీ ప్రింటింగ్‌) ఈ ఇంజెన్‌ను తయారీ చేసినట్టు పేర్కొంది. ఈ సాంకేతికతతో ముడిసరుకులో 97 శాతం, ఉత్పత్తి సమయంలో 60 శాతం ఆదా అవుతుందని పేర్కొంది. ద్రవ ఇంధన ఆధారిత పీఎస్‌4ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ చివరి దశలో వినియోగిస్తారు. త్వరలో దీన్ని పీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో వినియోగించనున్నారు. ఇంజిన్‌ను భారతీయ సంస్థ విప్రో 3డీ తయారు చేయగా తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో విజయవంతంగా పరీక్షించారు.

➡️