జార్ఖండ్‌ గవర్నర్‌కి .. తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు 

 న్యూఢిల్లీ   :   జార్ఖండ్‌ గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ తెలిపింది. దీంతో ఆ బాధ్యతలను సి.పి. రాధాకృష్ణన్‌కు  అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్‌ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.  పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌కు  అదనపు బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను   కోరినట్లు  రాష్ట్రపతి భవన్‌ ఆ లేఖలో  తెలిపింది.   సి.పి. రాధాకృష్ణన్  బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నియామకం అమలులోకి వస్తుందని  వెల్లడించింది.

➡️