బీజేపీ ఎంపీగా పోటీ చేయనున్న సినీ నటి శోభన!

Feb 24,2024 17:22 #BJP MP, #shobhana, #Thiruvananthapuram

తిరువనంతపురం : ప్రముఖ సినీ నటి శోభన రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆమె బిజెపి నుంచి తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన కేరళలో జరగనున్న బిజెపి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఆరోజునే తొలి జాబితాను బిజెపి పార్టీ విడుదల చేయనున్నది. తిరువనంతపురం నియోజకవర్గం ఎంపీ శశిథరూర్‌ను ఢకొీట్టేందుకు శోభనను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపి నుంచి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, నటుడు సురేశ్‌ కుమార్‌ కూడా తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే అధిష్టానం మాత్రం నటి శోభనవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

➡️