పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు

May 5,2024 00:42 #cpm, #West Bengal

ప్రజాశక్తి – కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులు భారీ ప్రదర్శనగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. బంకురా, బిష్ణుపూర్‌, తమ్లుక్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులకు మద్దతుగా వేలాదిమంది ప్రదర్శనలో పాల్గొన్నారు. బంకురా నియోజకవర్గానికి నిలన్‌ దాస్‌గుప్తా, బిష్ణుపూర్‌ నియోజకవర్గానికి శీతల్‌ చంద్ర కైబర్తా కలిసి తమ నామినేషన్లను దాఖలు చేశారు. తమ్లుక్‌ నియోజకవర్గానికి సిపిఎం అభ్యర్థి సయన్‌ బెనర్జీ, కాంతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఊర్వశి భట్టాచార్య కలిసి తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందజేశారు.

➡️