‘ఇండియా’లో చేరలేదు.. ఎవరికైనా మద్దతిస్తాను : కమల్‌హాసన్‌

Feb 21,2024 16:35 #chennai, #Kamal Haasan

చెన్నై : విశ్వనటుడు కమల్‌హాసన్‌ ‘ఇండియా’ చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) ఏడవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మీడియాతో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ ఇండియా కూటమిలో చేరలేదు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే ఏ కూటమితోనైనా మేము పొత్తుకు సిద్ధం. అయితే స్థానిక భూస్వామ్య రాజకీయ శక్తులతో ఎంఎన్‌ఎం చేతులు కలిపి పనిచేయదు.’ అని ఆయన స్పష్టం చేశారు.

కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పొత్తుల విషయంపై చర్చలు జరుగుతున్నాయని కమల్‌ చెప్పారు. ఎంఎన్‌ఎం పార్టీ పెట్టిన కొత్తల్లోనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలను, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ పార్టీ పోటీ చేసినా గెలవలకపోయింది.

➡️