కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

ఢిల్లీ : కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కేంద్రంలో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు. ఈ క్రమంలో మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ జూన్ 8న  ప్రమాణస్వీకారం చేయనున్నారని బిజెపి వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రధాని నివాసంలో కేంద్ర కాబినేట్ భేటి అయి, ప్రస్తుత లోక్ సభను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. ఈరోజు(బుధవారం) సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. జూన్ 7 మధ్యాహ్నం బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం జరగనుంది. తరువాత నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు.

➡️