UP Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

May 14,2024 11:53 #dead, #road accident, #Uttar Pradesh

హాపుర్‌ : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ హైవే 09పై అల్లాభక్ష్‌పూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో వద్ద సోమవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో కారు నడుపుతున్న ఓ డ్రైవర్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢకొీట్టాడు. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణీకులు ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతులందరూ ఘజియాబాద్‌కి చెందినవారని, వారంతా మొరాదాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో అనుపమ్‌, అంకిత్‌, జీతు, శంకర్‌, సందీప్‌, ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో మీరట్‌లోని దలుహెరా నివాసి సచిన్‌ తీవ్రంగా గాయపడగా.. పోలీసులు అతన్ని చికిత్స కోసం మీరట్‌లోని ఆసుపత్రికి తరలించారు.

➡️