Supreme Court : కేరళలోని మాక్‌పోల్స్‌ ఇవిఎంలను తనిఖీ చేయండి

Apr 18,2024 13:32 #kerala, #mock polls, #Supreme Court

న్యూఢిల్లీ :   కేరళ మాక్‌పోల్స్‌లో బిజెపికి ‘అదనపు ఓట్లు’ నమోదైన ఇవిఎంలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి)ని ఆదేశించింది న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సమర్పించిన నివేదికలపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఇవిఎం ఓట్లతో పాటు వివిప్యాట్‌లలోని స్లిప్‌లను క్రాస్‌ వెరిఫికేషన్‌ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేరళలోని కాసర్‌గోడ్‌లో ఈ నెల 17న నిర్వహించిన మాక్‌ పోల్స్‌లో నాలుగు ఇవిఎంలలో బిజెపికి అదనపు ఓట్లు వచ్చాయని, ఇవిఎంలు తప్పుగా పనిచేశాయని ప్రశాంత్‌ భూషణ్‌ పేర్కొన్నారు. దీంతో వాటిని పరిశీలించాలని ఇసి తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది మనీందర్‌సింగ్‌ను ఆదేశించారు. ఇవిఎంలపై కేరళలోని అధికారిక ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాయని స్థానిక మీడియా తెలిపింది. ఇవిఎం యంత్రాలను మార్చాలని కోరినట్లు తెలిపింది.

➡️