Michaung Cyclone : ఆర్థిక సాయంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం

చెన్నై :    మిచౌంగ్‌ తుఫాను ఆర్థిక సాయంపై తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.19,692 ఆర్థిక సాయాన్ని నిర్దేశిత సమయంలో విడుదల చేసేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్‌లో కోరింది. మిచౌంగ్‌ తుఫాను ప్రభావంతో గతేడాది డిసెంబర్‌ 4-5 తేదీల్లో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

నిధుల విడుదల గురించి గతేడాది డిసెంబర్‌ 14న రాష్ట్ర ప్రభుత్వం హోమంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని సీనియర్‌ న్యాయవాదులు పి.విల్సన్‌, డి.కుమ్నమ్‌లు కోర్టుకు తెలిపారు. రూ.18,214.52 కోట్ల నిధులను విడుదల చేయాలంటూ డిసెంబర్‌ 26న కేంద్రానికి కూడా లేఖ రాసిందని వెల్లడించారు. తక్షణ సాయం కింద రూ.2,000 కోట్లను విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రధాన కార్యదర్శిలు గతేడాది డిసెంబర్‌ 19, ఈ ఏడాది జనవరి 10న కేంద్రానికి రాసిన లేఖలను పరిగణనలోకి తీసుకుని, మధ్యంతర ఉపశమనం కోసం ఎక్స్‌పార్ట్‌ ఆర్డర్‌ను జారీ చేయాలని కోరారు.

➡️