రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి

Feb 24,2024 08:47 #buses, #died, #railing, #two

గుజరాత్‌ : రెయిలింగ్‌ను బస్సు ఢీకొట్టి లోయలోపడటంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం గుజరాత్‌లో జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఖేడా జిల్లాలోని నడియాద్‌ ప్రాంతంలో అదుపుతప్పి 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం … అహ్మదాబాద్‌-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొని 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్‌ గధియా మీడియాతో మాట్లాడుతూ … ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్‌ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్‌ ట్యాంకర్‌.. బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

➡️