హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్‌

Apr 25,2024 07:19 #supreem court, #West Bengal

న్యూఢిల్లీ : రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఏకపక్షంగా ఈ తీర్పు ఇచ్చిందని పిటీషన్‌లో ప్రభుత్వం ఆరోపించింది. ‘రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా.. తక్షణం అమలుతో బోధన, బోధనేతర సిబ్బందిని హైకోర్టు విధుల నుంచి తొలగించింది’ అని పిటిషన్‌లో తెలిపింది.

➡️