అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య

Feb 12,2024 08:09 #Koulu Rythu, #Suicide

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు చూసింది. మాచర్ల పట్టణ సిఐ శరత్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కంభంపాడుకు చెందిన ఉప్పుతోళ్ల శివకృష్ణ (27) వ్యవసాయం చేస్తుంటారు. గతేడాది కంభంపాడులో ఆరెకరాల్లో వరి, మాచర్ల పట్టణ శివారులో రెండెకరాల్లో కంది పంటలను కౌలుకు సాగు చేశారు. పొలాలకు నీరు సరిగా అందక దిగుబడులు బాగా తగ్గి అప్పులు పాలై కొద్ది రోజులుగా తీవ్రంగా మధనపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లారు. అర్థరాత్రైన ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు రాత్రంతా వెదికి తెల్లవారుజామున శివకృష్ణ సాగు చేస్తున్న పొలం వద్దకు వెళ్లి చూడగా ఆయన అక్కడ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. శివకృష్ణకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

➡️