ఆర్‌టిసికి 5 జాతీయ అవార్డులు

Mar 15,2024 21:40 #APSRTC, #Five awards

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎపిఎస్‌ఆర్‌టిసికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి. 2022ా23కు గానూ ప్రకటించిన ది నేషనల్‌ పబ్లిక్‌ బస్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో ఐదు అవార్డులు ఎపిఎస్‌ఆర్‌టిసికే వచ్చాయి. ఆర్‌టిసిలో సాంకేతిక పరిజ్ఞానం, ఇంధన సామర్థ్యం, టిక్కెటేతర ఆదాయం ఆర్జన, సిబ్బంది సంక్షేమం, డిజిటల్‌ యాప్‌ ద్వారా సేవలు వంటి అంశాల్లో ఆర్‌టిసికి ఈ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను శుక్రవారం ఢిల్లీలో రవాణాశాఖ కార్యదర్శి అనురాగ్‌జైన్‌ చేతుల మీదుగా ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, జివి రవివర్మ, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ వై శ్రీనివాసరావు పాల్గోన్నారు.

ఎఎస్‌ఆర్‌టియు వైస్‌ ప్రెసిడెంట్‌గా ద్వారకా తిరుమలరావు

అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌టేకింగ్‌ (ఎఎస్‌ఆర్‌టియు) వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఎఎస్‌ఆర్‌టియు వార్షిక జనరల్‌ బాడీ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఎఎస్‌ఆర్‌టియు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి సూర్యకిరణ్‌, తెలంగాణ ఆర్‌టిసి ఎమ్‌డి సజ్జనార్‌, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సిఎమ్‌డి శిల్పాశిండేలతోపాటు పలువురు ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులు ద్వారకా తిరుమలరావుకు అభినందనలు తెలిపారు.

➡️