ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ వేటు

Mar 17,2024 18:46 #EC, #srikakulam, #suspended, #VRO

ప్రజాశక్తి-అమరావతి :  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార  వైసిపి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి.. వీఆర్వో రమేష్‌ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధరణ కావడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️