గ్రూప్‌-1పై విచారణ 18కి వాయిదా

Mar 27,2024 22:40 #AP High Court, #judgement

– మధ్యంతర ఉత్తర్వుల అమలు పొడిగింపు
ప్రజాశక్తి-అమరావతి :గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు విచారణ ఏప్రిల్‌ 18కి వాయిదా పడింది. ఎపిపిఎస్‌సి, పలువురు అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్‌, జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం మరోసారి విచారణ జరిపింది. గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన 167 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించొద్దన్న గత మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. రాష్ట్రం తరఫున స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ చింతల సుమన్‌ వాదిస్తూ, అప్పీళ్ల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని, గడువు కావాలని కోరారు. దీంతో విచారణ 18కి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు గత మధ్యంతర ఉత్తర్వులను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

➡️