తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు. గురువారం స్వామివారిని 57, 357 మంది దర్శించుకోగా 18, 924 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.52 కోట్లు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 11న 7వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఎస్‌.వి.వేద వ్ఞిన పీఠం, ఎస్‌.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.

➡️