తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్లాట్‌ టైం టోకెన్లు పొందిన యాత్రికులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేసిన విషయం తెలిసిందే.శనివారం స్వామివారిని 56,200 మంది యాత్రికులు దర్శించుకోగా 16, 904 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

➡️