తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Dec 14,2023 10:57 #Assembly Meeting, #Telangana

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్‌ను స్పీకర్ కుర్చీలో కూర్చొబెట్టారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సిద్ధిపేట ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్‌ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, కేటీఆర్‌, పద్మారావు, పాడి కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారాలు పూర్తయిన అనంతరం స్పీకర్‌ ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ అధికారికంగా ప్రకటించారు.

➡️