నారా లోకేష్‌ యువగళం 3000 కిలో మీటర్లు పూర్తి.. నారా బ్రాహ్మణి ట్వీట్‌

Dec 11,2023 16:19 #Nara Lokesh

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర 3000 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. లోకేశ్‌ మూడువేల కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌ వేదిక ద్వారా బ్రాహ్మణి షేర్‌ చేశారు. కాగా, నారా లోకేష్‌ 219 రోజుల్లో, పది ఉమ్మడి జిల్లాల్లో, 92 నియోజకవర్గాలు… 217 మండలాలు… 1915 గ్రామాలు… 70 బహిరంగ సభలు… 145 సమావేశాల్లో పాల్గొన్నారు.

➡️