ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశాం : మంత్రి మేరుగ

Jan 17,2024 12:58 #BR Ambedkar, #Minister Meruga, #statue

ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మయన్మార్‌ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ”అంబేద్కర్‌ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్‌ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు” అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

➡️