మోహన్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 23,2024 14:46 #Nara Bhuvaneshwari, #speech

చిత్తూరు : జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్‌ మండలం, ముత్తుకూరు గ్రామంలో పార్టీ కార్యకర్త మోహన్‌ నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గతేడాది అక్టోబర్‌ 14న మోహన్‌ నాయుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ క్రమంలో మోహన్‌ నాయుడు కుటుంబ సభ్యులను భువనమ్మ ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు. మృతుని పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి ఉచిత విద్య అందిస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు.

➡️